16
Advtisement
Plasement 2

అన్నమయ్య కీర్తన రంగ రంగ రంగపతి - శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు


రాగం: సింధు భైరవ

రంగ రంగ రంగ పతి రంగనాధా నీ ।
సింగారాలె తరచాయ శ్రి రంగ నాధా ॥

పట్ట పగలే మాతో పలుచగ నవ్వేవు ।
ఒట్టులేల టలిగిరించు వడి నీ మాటలు వింటె ।
రట్టడివి మేరమీరకు రంగనాధా ।
రంగనాధా శ్రీ రంగనాధా ॥

కావేటి రంగమున కాంతపై పాదాలు సాచి ।
రావు పోవు ఎక్కడికి రంగ నాధా ।
శ్రీ వేంకటాద్రి మీద చేరి నను కూడితివి ।
ఏవల చూచిన నీవేయిట రంగనాధా ॥

రంగనాధా శ్రీ రంగనాధా